Pushpa Dialogue Promos: బ్యాక్ టు బ్యాక్ 'పుష్ప' డైలాగ్ ప్రోమోలు.. పండగ చేసుకుంటున్న అల్లు అర్జున్ ఫాన్స్!! (వీడియో)

Allu Arjun's Pushpa Movie Back 2 Back Dialogue Promos: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కీలక పాత్రలో నటించిన మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'పుష్ప: ది రైజ్‌' డిసెంబర్ 17న దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య విదులైన ఈ సినిమా.. బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలుకొడుతోంది. మొదటివారం రికార్డు కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. సినిమా రిలీజ్ కాకముందే పుష్ప సినిమాలోని డైలాగ్స్, సాంగ్స్ బాగా పాపులర్ అయ్యాయి. ప్రతిఒక్కరు అల్లు అర్జున్ చెప్పే డైలాగులకు (Allu Arjun Dialogues) బాగా కనెక్ట్ అయిపోయారు. ముఖ్యంగా మెగా ఫాన్స్. ఈ నేపథ్యంలో చిత్ర బృందం అభిమానుల కోసం తాజాగా ఓ వీడియో వదిలింది. 

పుష్ప సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చెప్పే డైలాగులను వీడియోగా రూపొందించిన చిత్ర బృందం తాజాగా రిలీజ్ చేసింది. బ్యాక్ టు బ్యాక్ 'పుష్ప' డైలాగ్ ప్రోమోలను (Pushpa Movie Back 2 Back Dialogue Promos) యుట్యూబ్‌లో విడుదల చేసింది. 'చూసిందా.. ఒక్కసారి కూడా చూడాలే అమ్మి', 'భలే హ్యాపీగా ఉందికదరా నీకు', 'ఏందయ్యా నువ్ అలా కాలు మీద కాలేసుకుని కుర్చున్నావ్ ఓనర్ వస్తుంటే', 'నా కాలు మీద నా కాలేసుకున్న.. మీ ఓనర్ మీద ఏసినానా ఏందీ', 'పుష్ప ఉంటే సరుకు ఉండదు.. సరుకు ఉంటే పుష్ప ఉండడు', 'కొత్త పిల్లకాయ అంటుండవు.. నమ్మొచ్చా' అనే డైలాగ్ ప్రోమోలు వీడియోలో ఉన్నాయి. 

Also Read: YouTuber: భారీగా రిపేర్ బిల్లు వచ్చిందని.. రూ. 70 లక్షల విలువైన ఎలక్ట్రిక్ కారును పేల్చేసిన యూట్యూబర్!!

అల్లు అర్జున్ చెప్పే డైలాగు (Allu Arjun Dialogues) వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో చూసిన బన్నీ ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ వీడియోకు ఇప్పటికే 388,391 వ్యూస్, 20 వేల లైకులు వచ్చాయి. అల్లు అర్జున్ నటన, కన్నడ భామ రష్మిక మందన్న అందం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు ప్లస్ అయ్యాయి. మైత్రీ మూవీ మేకర్స్‌, ముత్తం శెట్టి మీడియా క‌లిసి ఈ సినిమాను భారీ బ‌డ్జెట్‌తో నిర్మించాయి. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా మొదటి పార్ట్‌.. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ అయింది. 

చిత్తూరు జిల్లా శేషాచ‌ల అడ‌వుల్లో జ‌రిగే ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో పుష్ప సినిమా (Pushpa Movie)ను డైరెక్టర్ సుకుమార్ రూపొందించారు. అల్లు అర్జున్ పుష్ప రాజ్ అనే లారీ డ్రైవ‌ర్ పాత్ర‌లో, రష్మిక మందన్న (Rashmika Mandanna) శ్రీవల్లి పాత్రలో క‌నిపించారు. ఈ సినిమాలో మ‌లయాళ స్టార్ హీరో ఫ‌హాద్ ఫాజిల్ విల‌న్‌గా న‌టించారు. ఇక సునీల్, అన‌సూయ‌, అజ‌య్ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఇక స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఐటమ్ సాంగ్ చేసిన విషయం తెలిసిందే. 

Also Read: Tips to lose Weight: బరువు తగ్గేందుకు ఏడురోజుల్లో ఏడు టిప్స్, చేసి చూడండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

English Title: 
Allu Arjun's Pushpa Movie Back 2 Back Dialogue Promos
News Source: 
Home Title: 

బ్యాక్ టు బ్యాక్ 'పుష్ప' డైలాగ్ ప్రోమోలు.. పండగ చేసుకుంటున్న అల్లు అర్జున్ ఫాన్స్!!

Pushpa Dialogue Promos: బ్యాక్ టు బ్యాక్ 'పుష్ప' డైలాగ్ ప్రోమోలు.. పండగ చేసుకుంటున్న అల్లు అర్జున్ ఫాన్స్!! (వీడియో)
Caption: 
Allu Arjun's Pushpa Movie Back 2 Back Dialogue Promos (Source: Twitter)
Yes
Is Blog?: 
No
Facebook Instant Article: 
Yes
Highlights: 

పుష్ప ఉంటే సరుకు ఉండదు.. సరుకు ఉంటే పుష్ప ఉండడు

బ్యాక్ టు బ్యాక్ 'పుష్ప' డైలాగ్ ప్రోమోలు

పండగ చేసుకుంటున్న అల్లు అర్జున్ ఫాన్స్
 

Mobile Title: 
బ్యాక్ టు బ్యాక్ 'పుష్ప' డైలాగ్ ప్రోమోలు.. పండగ చేసుకుంటున్న అల్లు అర్జున్ ఫాన్స్!!
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Sunday, December 26, 2021 - 09:34
Request Count: 
131
Is Breaking News: 
No