యూరిక్ యాసిడ్ స్ఫటికాలు ఏర్పడటాన్ని నియంత్రించడానికి వీటిని ఆహారంలో చేర్చుకోవచ్చు.
విటమిన్ సి పుష్కలంగా ఉండే స్ట్రాబెర్రీలు మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తాయి. ఇది యూరిక్ యాసిడ్‌ను తగ్గిస్తుంది.
దానిమ్మలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది యూరిక్ యాసిడ్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. గౌట్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
లైకోపీన్, పొటాషియం కలిగిన టమోటాలు యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.
యాంటీఆక్సిడెంట్లు, ఆంథోసైనిన్లు అధికంగా ఉండే చెర్రీస్, యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో.. వాపును తగ్గించడంలో సహాయపడతాయి.
విటమిన్ సి పుష్కలంగా ఉండే ఎర్ర బెల్ పెప్పర్స్ అదనపు యూరిక్ యాసిడ్‌ను నియంత్రించడంలో సహాయపడతాయి.