అందమైన భావన

ప్రేమ అనేది స్త్రీ, పురుషుల మధ్యనే గాక అందరిలో కలిగే అందమైన భావన. నాకు తోడుగా.. నా జీవితానికి మార్గదర్శిగా.. నాకు రక్షణగా నిలుస్తున్న నీకు ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు.

Ravi Kumar Sargam
Feb 14,2025
';

నీ ప్రేమ ఓ మలుపు

నీ పరిచయం నా జీవితానికి ఒక మలుపు. మిత్రుడిగా.. సంరక్షకుడిగా.. ఆపద్బాంధవుడిగా.. ఆత్మీయుడిగా.. విడదీయలేని బంధంగా నిలుస్తున్న నీకు ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు.

';

నా జీవితమే నీకు

కష్టసుఖాల్లో.. ఆనందాల్లో.. ప్రతి భావనలోనూ నాకు తోడుగా నిలిచే నీకు ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు. ఒకసారి నువ్వు ప్రేమించావంటే నా జీవితమే నీకు అర్పించేస్తా.

';

ఒక్క రోజు చాలదు

నీపై ఉన్న ప్రేమ చాటి చెప్పేందుకు లవర్స్‌ డే ఒక్క రోజు చాలదు. అనిర్వచనీయమైన ప్రేమను చాటి చెప్పేందుకు నా జీవితమే సరిపోదు. శుభాకాంక్షలు చెప్పినా చెప్పకపోయినా నా మనసు నీకు తెలుసు. నీ ప్రేమ నాకు తెలుసు.

';

అమృతం పంచిన

కల్లోలితమైన నా మనసుకు.. గందరగోళమైన నా వ్యక్తిత్వానికి.. చిత్తు కాగితంలా ఉన్న నా జీవితానికి.. ప్రేమ లేని నా నిర్జీవానికి.. నీ ప్రేమ అనే అమృతం అందించావు. ప్రేమ అనే అమృతం పంచిన నా దేవత/ నా దేవుడికి ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు.

';

నువ్వు వచ్చాకే

నాకంటూ ఓ మనసు ఉందని.. నాకంటూ ఓ వ్యక్తిత్వం ఉందని.. నువ్వు వచ్చాకే తెలిసింది.. నీ ప్రేమ ఇచ్చాకే తెలిసింది. నాలో ప్రేమను చిగురించి.. జీవితమైన మధురమైన ఫలాన్ని అందించిన నీకు ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు.

';

VIEW ALL

Read Next Story