తులసి ఆకులు రోజుకు కనీసం రెండు బాగా నమిలి తినడం వల్ల బోలెడన్ని లాభాలు ఉన్నాయి. తులసి ఆకులు శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచి, వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో సహాయపడతాయి.
తులసి ఆకుల్లో నేచురల్ ఎంజైమ్‌లు ఉండటంతో అజీర్ణ సమస్యలు, గ్యాస్, ఎసిడిటీ సమస్యలు తగ్గుతాయి.
రోజూ తులసి ఆకులను నమిలితే మైండ్ రిలాక్స్ అవుతుంది. ఒత్తిడిని తగ్గించి నిద్ర సమస్యలను దూరం చేస్తుంది.
తులసి ఆకులను తినడం వల్ల షుగర్ లెవెల్స్ బ్యాలెన్స్ అవ్వడం, డయాబెటిస్ కంట్రోల్ అవ్వడం జరుగుతుంది.
తులసి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే గుణాలు కలిగి ఉంటుంది. హైబీపీ, చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతుంది.
తులసిలో యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఉండటంతో మొటిమలు, చర్మ సమస్యలు తగ్గుతాయి.
పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే.