ఇడ్లీ లోకి టమాటా అల్లం చట్నీ తింటే రుచితో పాటు ఆరోగ్యం కూడా మన సొంతం అవుతుంది. మరి ఈ రుచికరమైన చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం.
టమాటా, అల్లం, మిర్చి, నువ్వుల కలయికతో చేసుకునే ఈ చెట్ని అద్భుతమైన చట్నీ రుచి ఇస్తుంది.
నూనెలో వేయించుకున్న రెండు టమాటాలు, అలానే వేయించుకున్న 5 పచ్చిమిరపకాయలు, ధనియాలు, కొద్దిగా అల్లం, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని చివరిగా తాలింపు పెట్టుకోవాలి.
ఈ రుచికరమైన చట్నీ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అల్లం జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తుంది.
అల్లం, టమాటాల్లో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటంతో ఇది శరీరానికి రోగనిరోధక శక్తిని అందిస్తుంది.
తక్కువ పదార్థాలతో త్వరగా తయారుచేసే ఈ టమాటా అల్లం చట్నీ, రుచికి కూడా ప్రత్యేకంగా ఉంటుంది.
ఈ చట్నీని ఇడ్లీ, దోస, ఉప్మా, వడలాంటి బ్రేక్‌ఫాస్ట్ ఐటమ్స్‌తో కలిపితే రుచి రెట్టింపు అవుతుంది.
పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే.