ఇడ్లీ దోశ రెండింటికీ ఒకే పిండి తయారు చేసుకోవడం వలన సమయం ఆదా అవుతుంది. అదనంగా, సరిగ్గా పిండిని సిద్ధం చేస్తే, సాఫ్ట్ ఇడ్లీ, క్రిస్పీ దోస తయారు చేయడం సులభం.
కావాల్సిన పదార్థాలు : ఇడ్లీ బియ్యం – 2 కప్పులు , ఉద్దిపప్పు – 1 కప్పు, అటుకులు (పోహా) – 1 కప్పు, మెంతులు – ¼ టీ స్పూన్, ఉప్పు – రుచికి తగినంత
ముందుగా బియ్యం, ఉద్దిపప్పు, అటుకులు, మెంతులను నీటిలో నానబెట్టాలి. ఈ మిశ్రమాన్ని కనీసం 6 గంటలు నానబెట్టాలి.
మిక్సీ లేదా గ్రైండర్ లో నీరు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. తడి కాటన్ కవర్‌తో మూసి, 8-10 గంటలు లేదా రాత్రంతా ఫెర్మెంటేషన్‌కు పెట్టాలి.
కొద్దిగా ఉప్పు వేసి ఇడ్లీ లేదా దోశ వేసుకునే ముందు కలుపుకోండి. సాఫ్ట్ ఇడ్లీ కోసం – స్టీమ్ చేసేటప్పుడు పిండిని కాస్త గట్టిగా ఉంచాలి. క్రిస్పీ దోస కోసం – తడిగా ఉంచిన పిండిని నీరు కలిపి పలుచగా చేసుకోవాలి.
ఇలా తయారు చేసిన ఒకే పిండితో ఇడ్లీ మరియు దోస రెండూ చేయొచ్చు. ఇది తక్కువ శ్రమతో ఎక్కువ ప్రయోజనం అందిస్తుంది. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీ అభిప్రాయాన్ని చెప్పండి!
పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వంట నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.