ఇవి 3 మిక్స్ చేసిన రసం తాగితే.. గ్యాస్ట్రిక్ సమస్య పరార్..

Dharmaraju Dhurishetty
Feb 21,2025
';

కీర దోసకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీంతోపాటు కాస్తంత ఫైబర్ కూడా లభిస్తుంది.

';

కీరదోసకాయతో తయారుచేసిన సలాడ్ తినడం వల్ల ఎన్నో రకాల లాభాలు కలుగుతాయి. అలాగే దీనిని కొంతమంది జ్యూస్లా తయారు చేసుకుని కూడా తాగుతూ ఉంటారు.

';

ముఖ్యంగా పొట్ట సమస్యలతో బాధపడుతున్న వారు రోజు కీర దోసకాయ రసం తాగితే విశేషమైన ప్రయోజనాలు పొందగలుగుతారు.

';

కీర దోసకాయ రసం రోజూ తాగడం వల్ల గ్యాస్టిక్ సమస్యలు తొలగిపోవడమే కాకుండా మలబద్ధకం, ఇతర పొట్ట సమస్యలు రాకుండా ఉంటాయి.

';

అయితే ఇంట్లోని కీర దోసకాయ రసం తయారు చేసుకుని తాగాలనుకునే వారు.. తప్పకుండా ఆయుర్వేద నిపుణులు సూచించిన ఈ పద్ధతిలో తయారు చేసుకొని తాగండి..

';

కావలసిన పదార్థాలు: 1 కీర దోసకాయ, 1/2 నిమ్మకాయ, కొంచెం అల్లం, కొంచెం పుదీనా, 1/2 కప్పు నీరు

';

తయారీ విధానం: ముందుగా కీరదోసకాయ, అల్లం పై తొక్కలేను తీసి బాగా శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి.

';

ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసుకున్న ముక్కలను వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఆ తర్వాత తగినంత నీరు, పుదీనా వేసుకొని మరోసారి బాగా గ్రైండ్ చేసుకోండి.

';

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని వడకట్టుకొని గాజు గ్లాసులోకి తీసుకోండి.. తీసుకొని ఉదయాన్నే తాగితే పొట్ట సమస్యలతో పాటు గ్యాస్టిక్ సమస్య తొలగిపోతుంది..

';

VIEW ALL

Read Next Story