ఎన్ని మందులు వాడినా దగ్గు, జలుబు తగ్గట్లేదు? ఇది ఒక గ్లాసు తాగితే చాలు!
Dharmaraju Dhurishetty
Feb 22,2025
';
తరచుగా చాలామంది దగ్గు, జలుబు వంటి సమస్యల బారిన పడుతూ ఉంటారు. ముఖ్యంగా చిన్నపిల్లలకు ఈ సమస్యలు ఎక్కువ వస్తూ ఉంటాయి.
';
శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతిని.. ఈ దగ్గు, జలుబు వంటి సమస్యల బారిన పడుతూ ఉంటారు.
';
చాలామంది దగ్గు, జలుబుతో బాధపడేవారు ఔషధాలను ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. నిజానికి ఇలా వాడడం అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
';
ఈ దగ్గు, జలుబు సమస్యలకు సులభంగా ఇంట్లోనే ఆయుర్వేద పద్ధతిలో చెక్ పెట్టవచ్చు. ఆయుర్వేద నిపుణులు సూచించే ఈ రెమెడీ వినియోగిస్తే సమస్య పరార్..
';
ముఖ్యంగా వాముతో తయారుచేసిన నీటిని ఉదయాన్నే తాగడం వల్ల దగ్గుతో పాటు జలుబు సమస్య కూడా తొలగిపోతుందట.
';
అలాగే వాములో ఉండే గుణాలు పొట్ట సమస్యలను తగ్గించేందుకు కూడా ఎంతో సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
';
వాములో ఉండే కొన్ని ఆయుర్వేద గుణాలు శరీరంలోని చెడు కొలెస్ట్రాలను కూడా తగ్గిస్తాయట. ఇవే కాకుండా బోలెడు లాభాలను చేకూర్చుతాయి.
';
అయితే ఈ వాము వాటర్ ను మీరు కూడా ఇంట్లోనే తయారు చేసుకొని తాగాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ఇలా ట్రై చేయండి.
';
ఈ వాము వాటర్‌ను తయారు చేసుకోవడానికి ఒక రోజు ముందే ఒక చిన్న గాజు గ్లాసులో నీటిని నింపుకొని వామును వేసుకొని నానబెట్టుకోవాల్సి ఉంటుంది.
';
ఉదయాన్నే నానబెట్టుకున్న వామును ఒక బౌల్లో వేసుకొని తగినంత నీటిని పోసుకొని బాగా వేడి చేసుకోండి. ఇలా వేడి చేసుకున్న నీటిని ఒక గాజు గ్లాసులోకి వడకట్టుకొని తగినంత తేనె వేసుకొని మీరు చేసుకోండి.
';
తేనె వేసుకొని మిక్స్ చేసుకున్న వాము వాటర్ ను ఖాళీ కడుపుతో రోజు ఉదయాన్నే తాగితే.. సులభంగా దగ్గు, జలుబు సమస్యలకు విముక్తి కలుగుతుంది.