విటమిన్ బి 12 లోపాన్ని తరిమికొట్టే కర్రీ.. వారంలో ఒకసారైనా తినండి..
Dharmaraju Dhurishetty
Feb 22,2025
';
ప్రస్తుతం చాలామందిలో ఆధునిక జీవనశైలి పాటించడం వల్ల విటమిన్ లోపం వంటి సమస్యలు వస్తున్నాయి.
';
కొంతమంది ఆరోగ్యకరమైన ఆహారాలు తినకపోవడం కారణంగా విటమిన్ బి లోపంతో పాటు బి-12 వంటి విటమిన్ లోపం సమస్యలు వస్తున్నాయి.
';
విటమిన్ లోపల సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. లేకపోతే అనేక రకాల అనారోగ్య సమస్యలకు దారి తీయవచ్చు.
';
మీరు కూడా విటమిన్ బి 12 లోపం సమస్యతో బాధపడుతున్నారా? ఏం కంగారు పడనక్కర్లేదు.. సోయా పాలు, పుట్టగొడుగులతో తయారుచేసిన కర్రీ తింటే ఈ లోపం సమస్యకు చెక్ పెట్టవచ్చు.
';
ఇంట్లోనే సోయా పాలు, పుట్టగొడుగుల కర్రీని తయారు చేసుకోవచ్చు. ఈ కర్రీ ని ఎలా తయారు చేసుకోవాలో కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
కావలసిన పదార్థాలు: అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 టేబుల్ స్పూన్, పసుపు: 1/2 టీ స్పూన్, కారం: 1 టీ స్పూన్, ధనియాల పొడి: 1 టీ స్పూన్
';
కావలసిన పదార్థాలు: గరం మసాలా: 1/2 టీ స్పూన్, నూనె: 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు: రుచికి సరిపడా, కొత్తిమీర: కొద్దిగా (సన్నగా తరిగిన)
';
తయారీ విధానం: ముందుగా పుట్టగొడుగులను బాగా శుభ్రం చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది.
';
ఆ తర్వాత స్టౌవ్ పై ఓ పెద్ద పాన్ పెట్టుకుని అందులో తగినంత నూనె వేడి చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చేంతవరకు వేపుకోండి.
';
వేగిన తర్వాత అల్లం, వెల్లుల్లి పేస్ట్, టమాటోలు వేసుకొని బాగా ఉడికించుకోవలసి ఉంటుంది. ఆ తర్వాతపసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు వేసి బాగా కలపాలి.
';
అన్ని బాగా వేగిన తర్వాత అందులోనే పుట్టగొడుగులు వేసి మరో ఐదు నిమిషాల పాటు వేపుకోండి. ఆ తర్వాత సోయా మిల్క్ వేసి మరో అయిదు నిమిషాల పాటు ఉడికించుకోండి. చివరగా కొత్తిమీర వేసి దింపుకోండి..
';
ఇలా తయారు చేసుకున్న కర్రీని రోటీల్లోకి తీసుకుంటే అద్భుతమైన రుచి పొందడమే కాకుండా.. విటమిన్ బి 12 లోపం నుంచి విముక్తి పొందుతారు..