క్విక్ గా ఓట్స్ తో ఊతప్పం ఇలా చేయండి హెల్త్ కి మంచిది

Shashi Maheshwarapu
Feb 23,2025
';

ఓట్స్ ఊతప్పం అనేది రుచికరమైన దక్షిణ భారతీయ వంటకం.

';

ఇది ఓట్స్, కూరగాయలతో తయారు చేస్తారు.

';

ఇది త్వరగా, సులభంగా తయారుచేయవచ్చు.

';

పదార్థాలు: ఓట్స్ - 1 కప్పు, ఉప్మా రవ్వ - 1 కప్పు, నూనె - తగినంత

';

పెరుగు - 1 కప్పు, ఉల్లిపాయ - 1, టమాటా - 1

';

పచ్చిమిర్చి - 2 , కొత్తిమీర - కొద్దిగా, ఉప్పు - రుచికి సరిపడా

';

విధానం: ముందుగా ఓట్స్ ను మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.

';

ఒక గిన్నెలో ఓట్స్ పొడి, రవ్వ, పెరుగు, ఉప్పు వేసి బాగా కలపాలి.

';

అవసరమైతే కొద్దిగా నీరు పోసి దోశ పిండిలా కలుపుకోవాలి.

';

ఈ పిండిని 15 నిమిషాలు నాననివ్వాలి.

';

తరువాత, ఈ పిండిలో ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి కలపాలి.

';

స్టవ్ పై పెనం వేడి చేసి, కొద్దిగా నూనె వేయాలి.

';

ఒక గరిటెడు పిండిని పెనంపై వేసి ఊతప్పంలా కొద్దిగా మందంగా వేయాలి.

';

రెండు వైపులా బంగారు రంగు వచ్చేవరకు కాల్చాలి.

';

వేడి వేడి ఊతప్పంను చట్నీ లేదా సాంబార్ తో సర్వ్ చేయాలి.

';

VIEW ALL

Read Next Story