దోసకాయని రోజు తినడం వల్ల ఎన్నో రకాల లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
';
అలాగే దోసకాయ నుంచి తీసిన రసాన్ని తాగడం వల్ల కూడా శరీరానికి అద్భుతమైన లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
';
ముఖ్యంగా దోసకాయ రసంలో శరీరానికి కావలసిన విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ బి పుష్కలంగా లభిస్తాయి.
';
అలాగే ఈ రసంలో ఫైబర్‌తో పాటు పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం ఎక్కువ మోతాదులో లభిస్తాయి..
';
రోజు ఈ రసం తాగడం వల్ల గుండె నుంచి చర్మ సమస్యల వరకు అన్నీ తొలగిపోతాయి. అయితే చాలామంది ఈ రసాన్ని తయారు చేసుకునే క్రమంలో కొన్ని పొరపాట్లు పడుతున్నారు.
';
ముఖ్యంగా సులభంగా బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా దోసకాయ రసం తయారు చేసుకునే క్రమంలో కొన్ని ఆకులను కూడా కలపాల్సి ఉంటుంది..
';
ఆయుర్వేద నిపుణులు సూచించిన పద్ధతిలో దోసకాయ రసాన్ని తయారు చేసుకొని తాగితే మంచి ఫలితాలు పొందగలుగుతారు.
';
ముందుగా ఈ రసాన్ని తయారు చేసుకోవడానికి తాజా దోసకాయలను తీసుకొని దానిపైన ఉండే పొట్టును తొలగించి చిన్న చిన్న ముక్కలుగా తీసుకోండి.
';
ఇలా కట్ చేసుకున్న ముక్కలను మిక్సీ గ్రైండర్‌లో వేసుకొని అందులో పుదీనా ఆకులు, కొత్తిమీర ఆకులు వేసుకొని మిక్సీ కొట్టుకోండి.
';
మిక్సీ పట్టుకున్న తర్వాత అందులోనే రుచికి సరిపడా తేనే, తగినంత నీటిని వేసుకుని వడకట్టుకోండి. ఇలా వడగట్టుకున్న రసాన్ని రోజు ఉదయాన్నే తాగితే.. సింపుల్గా బరువు తగ్గుతారు..