ఈ లడ్డు ఒకటి తింటే.. జుట్టు ఒత్తుగా అందంగా పెరుగుతుంది!

Dharmaraju Dhurishetty
Feb 18,2025
';

చాలామందిలో జుట్టు సమస్యలు రావడం సర్వ సాధారణమైంది.. కొంతమందిలో జుట్టు తెల్లబడడం, గడ్డం పెరగకపోవడం వంటి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి.

';

మరికొంతమందిలోనైతే జుట్టు పెరిగినప్పటికీ తరచుగా రాలిపోతూ ఉంటుంది. ఇవే కాకుండా ఎన్నో జుట్టు సమస్యలు వస్తూ ఉంటాయి.

';

జుట్టు సమస్యలతో బాధపడే వారికి అద్భుతమైన లడ్డు రెసిపీని పరిచయం చేయబోతున్నాం.. ఈ లడ్డు రోజు ఒకటి ఉదయం తింటే అద్భుతమైన ఫలితాలు పొందగలుగుతారు.

';

అవిసె గింజలతో తయారు చేసిన లడ్డు రోజు ఉదయాన్నే తినడం వల్ల విశేషమైన ప్రయోజనాలు పొందుతారు. ఇందులో ఉండే గుణాలు జుట్టును అందంగా చేసేందుకు సహాయపడతాయి.

';

గడ్డం బొద్దుగా పెంచేందుకు కూడా అవిసె గింజల లడ్డు ఎంతగానో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

';

జుట్టు సమస్యలతో బాధపడుతున్న వారు ఇంట్లోనే సులభంగా ఈ అవిసె గింజల లడ్డును తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ఇలా ట్రై చేయండి..

';

కావలసిన పదార్థాలు: అవిసె గింజలు - 1 కప్పు, బెల్లం - 1/2 కప్పు, నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి - 1/2 టీస్పూన్, డ్రై ఫ్రూట్స్ - 1/4 కప్పు (బాదం, జీడిపప్పు, కిస్మిస్ మొదలైనవి)

';

తయారీ విధానం: ముందుగా అవిసె గింజలను ఒక పాన్ లో వేసుకొని.. అందులోనే తగినంత నెయ్యి వేడి చేసి బాగా వేపుకోవాల్సి ఉంటుంది.

';

వేయించిన అవిసె గింజలను పక్కన పెట్టుకొని.. అందులోనే అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, డేట్స్ వేసి బాగా వేపుకోండి. ఇలా అన్ని వేపుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోండి.

';

అన్ని మిక్సీ పట్టుకున్న తర్వాత బెల్లం పాకం పెట్టుకొని, మిక్సీలో బెల్లం పాకం వేసుకొని కూడా బాగా మిక్సీ పట్టుకోండి. అంతే మొత్తం మిశ్రమంలా తయారైపోతుంది.

';

ఇలా తయారైన గట్టి పాటి మిశ్రమాన్ని కొద్దిసేపు పక్కన పెట్టుకుని చిన్న చిన్న లడ్డూల్లా తయారు చేసుకొని గాజు సీసాలో భద్రపరచుకోండి. ఇలా తయారు చేసుకున్న లడ్డు రోజు ఉదయాన్నే తింటే జుట్టు అద్భుతంగా పెరుగుతుంది.

';

VIEW ALL

Read Next Story