జుట్టు తగ్గిపోతుందా? తేనెతో సహజమైన చిట్కాలు పాటిస్తే, జుట్టు మృదువుగా, పొడవుగా, మందంగా పెరుగుతుంది. తేనె ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.
తేనెలో సహజమైన పోషకాలు ఉండటంతో జుట్టుకు తేమ అందించి, ఆరోగ్యంగా పెరగడాన్ని పెంపొందిస్తుంది. ఇది తల చర్మాన్ని మృదువుగా మార్చి, కొద్దిగా తేలికపాటి మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది.
తేనెను కరెక్ట్ గా ఎలాంటి పద్ధతిలో వాడితే జుట్టు బాగా పెరుగుతుందో చూద్దాం.
ఒక టేబుల్ స్పూన్ తేనె, ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె మిక్స్ చేయాలి. తలకు మర్దన చేసి, 30 నిమిషాల తర్వాత కడిగేయాలి. జుట్టు నల్లగా, మృదువుగా మారుతుంది.
ఒక టేబుల్ స్పూన్ తేనె, ఒక టేబుల్ స్పూన్ ఆలొవెరా జెల్ కలిపి తలకు అప్లై చేయాలి. ఇది తల చర్మాన్ని శుభ్రపరచి, కొత్త జుట్టు పెరగడానికి సహాయపడుతుంది.
ఒక స్పూన్ తేనె, రెండు స్పూన్లు పెరుగు కలిపి, తలకు 20 నిమిషాలు పట్టించాలి. ఇది జుట్టును మృదువుగా మార్చి, తేమను అందిస్తుంది.
తేనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు రాలే సమస్యను తగ్గిస్తాయి. తల చర్మానికి తేమ అందించి, పొడిదనాన్ని తొలగిస్తుంది. కుదుళ్లను బలపరిచి, జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుంది.
పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే.