వేసవిలో ఈ జావా తాగితే ఒంటికి చలవ చేస్తుంది..!!

Shashi Maheshwarapu
Feb 22,2025
';

జొన్న జావ అనేది ఒక సాంప్రదాయ భారతీయ పానీయం.

';

ఇది జొన్నలతో తయారుచేస్తారు.

';

ఇది పోషకమైనది, ఆరోగ్యకరమైన పానీయం.

';

జొన్నలలో ఫైబర్, ప్రోటీన్, ఐరన్ పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.

';

కావలసిన: జొన్న పిండి: 1 కప్పు, నీరు: 4 కప్పులు

';

మజ్జిగ: 1 కప్పు, ఉప్పు: రుచికి తగినంత

';

తయారీ: గిన్నెలో జొన్న పిండిని తీసుకొని కొద్దిగా నీరు పోసి ఉండలు లేకుండా కలపాలి.

';

ఒక మందపాటి గిన్నెలో మిగిలిన నీటిని పోసి మరిగించాలి.

';

మరుగుతున్న నీటిలో జొన్న పిండి మిశ్రమాన్ని నెమ్మదిగా పోస్తూ ఉండలు కట్టకుండా తిప్పుతూ ఉండాలి.

';

మిశ్రమం చిక్కబడే వరకు తక్కువ మంట మీద 5-10 నిమిషాలు ఉడికించాలి.

';

రుచికి తగినంత ఉప్పు కలపాలి.

';

జావ చల్లారిన తర్వాత మజ్జిగ కలిపి తాగవచ్చు.

';

కొంత మంది జొన్న పిండిని ముందుగా నీటిలో నానబెట్టి, ఆ తర్వాత ఉడికిస్తారు.

';

కొంత మంది జొన్న జావలో మజ్జిగకు బదులుగా నిమ్మరసం కలుపుతారు.

';

VIEW ALL

Read Next Story