Dark Circles: కంటి కింద నల్లని వలయాలను ఈజీగా తొలగించే అద్భుత చిట్కాలు
పచ్చి బంగాళదుంప జ్యూస్ తీసి దూది సహాయంతో కంటి కింద అప్లై చేస్తే డార్క్ సర్కిల్స్ తగ్గించవచ్చు
కీరాను రౌండ్‌గా కట్ చేసి కళ్లపై 20-30 నిమిషాలు ఉంచాలి. ఇవి కళ్లకు తేమను అందించి రక్త ప్రసరణ పెంచుతాయి.
టీ బ్యాగ్స్ వేడి నీళ్లలో ముంచి ఆ తరువాత ఫ్రిజ్‌లో చల్లార్చాలి. ఇందులో ఉండే కెఫీన్ స్వెల్లింగ్ దూరం చేస్తుంది
రాత్రి పడుకునే ముందు కళ్ల దిగువ భాగంలో అల్లోవెరా జెల్ రాసి మస్సాజ్ చేసుకోవాలి. రాత్రంతా అలా వదిలేయాలి ఉదయం లేచాక చళ్ల నీళ్లతో శుభ్రం చేసుకోవాలి.
టొమాటో రసంలో నిమ్మ రసం కొద్దిగా పిండి కంటి కింద అప్లై చేసి 10 నిమిషాలు ఉంచాలి. దీనివల్ల నల్లని వలయాలు తగ్గిపోతాయి
రోజ్ వాటర్‌లో చర్మానికి నిగారింపు ఇచ్చే గుణాలు ఉంటాయి. దూదితో కళ్ల కింద అప్లై చేసి 10-15 నిమిషాలు ఉంచాలి
కంటి చుట్టూ చల్లని పాలను అప్లై చేయాలి. అలా 10 నిమిషాలు ఉంచితే మంచి ఫలితాలు ఉంటాయి. ఇదొక సహజసిద్ధమైన క్లీన్సర్ . డార్క్ సర్కిల్స్ అద్భుతంగా తగ్గుతాయి
ఆరెంజ్ జ్యూస్‌లో గ్లిసరిన్ కొన్నిచుక్కలు కలిపి కంటి చుట్టూ రాసి 10-15 నిమిషాలు ఉంచాలి
కంటి కింద నల్లని వలయాలను దూరం చేసేందుకు కొబ్బరి నూనెతో కంటి కింద రోజూ మస్సాజ్ చేయాలి. రాత్రంతా అలానే వదిలేయాలి
డార్క్ సర్కిల్స్ తగ్గించేందుకు పుదీనా ఆకుల మిశ్రమం రాయాలి. అలా 15 నిమిషాలు ఉంచి చల్లని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి