ఇడియాప్పం, దీనిని స్ట్రింగ్ హాపర్స్‌గా కూడా అంటారు, సన్నని గారల రూపంలో ఉండే బ్రేక్‌ఫాస్ట్ ఐటెమ్. ఇది ఆరోగ్యకరమైన వంటకం, ఎటువంటి అదనపు నూనె లేకుండా తయారవుతుంది.
ఈ రెసిపీ కోసం కావలసినవి..: రైస్ ఫ్లోర్ – 1 కప్పు, నీరు – 1 కప్పు, ఉప్పు – ½ టీ స్పూన్, నూనె – 1 టీ స్పూన్
ఒక పాన్‌లో నీరు మరిగించి, ఉప్పు.. వేసి కలపాలి. అందులో బియ్యం పిండి వేసి, తక్కువ మంటపై కలిపి, మృదువుగా ఉండేలా చేయాలి.
మిశ్రమాన్ని నెమ్మదిగా గుజ్జుగా మార్చి, ఇడియాప్పం ప్రెస్ లేదా సీవ్ ఉపయోగించి తాడు లాంటి స్ట్రింగ్స్‌గా చేయాలి.
ఇడ్లీ ప్లేట్‌లో పెట్టి 10-12 నిమిషాలు ఆవిరిలో ఉడకనివ్వాలి. చక్కగా ఉడికి, మెత్తగా మారిన తర్వాత తీసి వేడిగా సర్వ్ చేసుకోవచ్చు.
ఇడియాప్పాన్ని కొబ్బరి పాలతో తింటే అద్భుతమైన రుచి వస్తుంది.
తేలికపాటి బ్రేక్‌ఫాస్ట్ కావడంతో జీర్ణతంత్రానికి మంచిది. కొవ్వు శాతం తక్కువగా ఉండటంతో బరువు తగ్గేవారికి బాగుంటుంది. గ్లూటెన్ ఫ్రీ ఫుడ్ కావడంతో ఆరోగ్యకరమైన అల్పాహారంగా పరిగణించబడుతుంది.