జుట్టు రాలే సమస్యతో మీరు కూడా పోరాడుతూ ఉంటే.. కనీసం మూడు రోజులకు ఒకసారి ఇప్పుడు చెప్పబోయే స్మూతీ తీసుకోవడం ఎంతో ఫలితాన్ని ఇస్. ఇందుకు కావాల్సినవి ఒక స్పూన్ మఖానా, గుమ్మడికాయ గింజలు, చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్.
మఖానాలో ప్రొటీన్లు, కాల్షియం ఎక్కువగా ఉండటంతో జుట్టు ఒత్తుగా, బలంగా పెరుగుతుంది.
గుమ్మడికాయలో ఉండే విటమిన్ A, బీటా కెరోటిన్ జుట్టు వృద్ధిని ప్రోత్సహించి, తేలిగ్గా ఊడిపోకుండా కాపాడుతుంది.
చియా సీడ్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండి, జుట్టు రాలే సమస్యను తగ్గించడంలో సహాయపడతాయి.
ఫ్లాక్స్ సీడ్స్ జుట్టుకి ప్రకాశవంతమైన నిగారింపు ఇచ్చి, పొడిబారకుండా తేమను అందిస్తాయి.
ఇవన్నీ కలిపి మిక్సీ కి వేసుకొని కొద్దిగా తేనె వేసుకొని.. తాగాలి. ఈ స్మూతీని రోజూ ఉదయాన్నే తాగితే జుట్టు పెరుగుదల వేగంగా జరుగుతుంది. లేదంటే కనీసం మూడు రోజులకు ఒకసారి అయినా తాగడం మంచిది.
జుట్టును సహజసిద్ధంగా పెంచాలనుకునే వారు ఈ స్మూతీని వారానికి 3 నుంచి 4 సార్లు తాగితే అద్భుతమైన ఫలితం కనపడుతుంది.
పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.