చాలామంది ప్రైడ్ పంప్కిన్ సీడ్స్ మంచివి అనుకుంటారు. కానీ కావాల్సినంత పోషకాలు పొందాలంటే గుమ్మడికాయ గింజలను వేయించుకోకుండా.. తినటం ఉత్తమం. ఇవి ప్రోటీన్, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు అందిస్తాయి.
మరీ రుచిగా కావాలంటే..కొంచెం నూనెలో వేయించి గుమ్మడికాయ గింజలను స్నాక్‌లా తినవచ్చు. దీనివల్ల కూడా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.
స్మూతీల్లో గుమ్మడికాయ గింజల పొడి కలిపితే ప్రోటీన్ ఎక్కువగా అందుతుంది. ఇది బరువు తగ్గడానికి, శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.
సలాడ్‌లలో లేదా పెరుగులో గుమ్మడికాయ గింజలు వేసుకుంటే రుచికరంగా ఉంటాయి. దీనివల్ల హార్ట్ హెల్త్ మెరుగుపడుతుంది.
కూరల్లో లేదా సూప్‌లలో గుమ్మడికాయ గింజల పొడి కలిపితే శరీరానికి అవసరమైన మినరల్స్, విటమిన్లు అందుతాయి.
ఈ గింజలను ఉదయం లేదా సాయంత్రం స్నాక్‌గా తింటే మంచి ఫలితాలు పొందవచ్చు. రాత్రి పడుకునే ముందు తింటే నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది.
పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు