క్రిస్పీ మసాలా ఇడ్లీ సులభంగా తయారయ్యే స్నాక్. టీ టైమ్‌కు ఈ ఇడ్లీ ని ఉదయాన్నే మిగిలిపోయిన ఇడ్లీలతో సులభంగా చేసుకోవచ్చు..
ఈ రెసిపీలో వాడేవి అన్నీ కూడా ఈ ఇడ్లీకి ఎంతో రుచిని అందిస్తాయి.
ఉదయం చేసి మిగిలిపోయిన ఇడ్లీలను ముక్కలుగా తరిగి ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి.
ఇప్పుడు స్టౌ పైన బాండలి పెట్టుకొని.. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎర్రగడ్డ ఎంచుకున్న తరువాత టమాటా, కూడా వేసుకొని వేయించుకోండి.
ఈ రెండు బాగా వేగిన తర్వాత ముందుగా ఫ్రై చేసిన ఇడ్లీలను ఇందులో వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు, కారం చల్లుకొని బాగా కలుపుకోండి.
సాధారణ ఇడ్లీలను ఇలా చేసుకుంటే.. పిల్లలు కూడా ఎంతో రుచికరంగా తినేస్తారు.