ఎప్పుడన్నా ఎంతో రుచికరమైన కరివేపాకు క్రిస్పీ దోశ తిన్నారా..? లేదంటే ఇలా ట్రై చేయండి.
కరివేపాకు వల్ల జీర్ణ వ్యవస్థ బలంగా ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. రుచికి తోడు మంచి ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది.
ఉద్దిపప్పు – 1 కప్పు, బియ్యం – 1 కప్పు, కరివేపాకు – 1 కట్ట, మిరియాలు – ½ టీ స్పూన్, జీలకర్ర – ½ టీ స్పూన్ , ఉప్పు – రుచికి తగినంత, నీరు – అవసరమైనంత, నూనె – దోశ కాల్చేందుకు
పెసరపప్పు, బియ్యం 4 గంటలు నానబెట్టాలి. నానిన తర్వాత మిక్సీలో కరివేపాకు, మిరియాలు, జీలకర్ర వేసి బాగా గ్రైండ్ చేయాలి. ఉప్పు, నీరు కలిపి దోశ పిండిలా సిద్ధం చేసుకోవాలి.
వేడైన పాన్‌పై పిండిని పోసి, తక్కువ మంటపై వేయించాలి. నూనె వేసి, రెండు వైపులా బాగా కాల్చాలి.
ఈ దోశను టమోటా పచ్చడి లేదా చట్నీతో తింటే రుచి అదిరిపోతుంది.
ఈ దోస వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. జుట్టు నల్లగా, ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుంది.
పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే.