ఎన్నో ఔషధాలు కలిగిన లడ్డు.. రోజు ఒకటి తింటే.. గుండె సమస్యలు పరార్..
Dharmaraju Dhurishetty
Feb 18,2025
';
సన్ఫ్లవర్ సీడ్స్‌లో ఉండే మెగ్నీషియం, సెలీనియం, ఫైబర్ ఎక్కువ మోతాదులో లభిస్తుంది. కాబట్టి రోజు తినడం వల్ల ఎన్నో రకాల లాభాలు కలుగుతాయి.
';
సన్ఫ్లవర్ సీడ్స్‌లో ఉండే వివిధ రకాల ఖనిజాలు శరీరానికి అద్భుతమైన శక్తిని అందించేందుకు సహాయపడతాయి.
';
అలాగే ఈ సీడ్స్‌లో ఉండే అద్భుతమైన పోషకాలు పురుషుల్లో టెస్టోస్టిరాన్ హార్మోన్‌ను మెరుగుపరిచేందుకు కూడా సహాయపడతాయి.
';
కాబట్టి రోజు ఈ సీడ్స్‌తో తయారు చేసిన లడ్డు తినడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు పొందుతారు.
';
ముఖ్యంగా గుండె జబ్బులు ఉన్నవారు ఈ లడ్డును తింటే.. ఇతర దీర్ఘకాలిక వ్యాధుల బారిన కూడా పడకుండా ఉంటారు.
';
మీరు కూడా ఈ లడ్డును ఇంట్లోనే తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ఇలా ట్రై చేయండి..
';
కావలసిన పదార్థాలు: 1 కప్పు సన్ఫ్లవర్ సీడ్స్, 1/2 కప్పు బెల్లం తురుము, 1/4 కప్పు నెయ్యి, 1/4 టీస్పూన్ యాలకుల పొడి
';
తయారీ విధానం: ముందుగా సన్ఫ్లవర్ సీడ్స్ ను దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఒక పాన్‌లో నెయ్యి వేసి వేడి చేసుకోండి.
';
వేడి చేసుకున్న నెయ్యిలోనే బెల్లం తురుము వేసి కొంత నీరును పోసి పాకం వచ్చేంతవరకు బాగా మరిగించుకోండి.
';
ఆ తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్‌ను మిక్సీ జార్‌లోకి తీసుకొని అందులో యాలకులు వేసి బాగా మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత బెల్లం పాకంలో ఈ పౌడర్ వేసుకోండి.
';
బెల్లం పాకంలో వేసుకున్న పౌడర్‌ను ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత చల్లారాక చిన్న చిన్న ముద్దలుగా తయారు చేసుకుని గాజు సీసాలో భద్రపరచుకోండి.
';
ఇలా తయారు చేసుకున్న లడ్డు గుండె, హార్మోన్ సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా తీసుకోండి.