మునగాకు ఐరన్, కాల్షియం, ఫైబర్ సమృద్ధిగా కలిగి ఉండి.. బరువు తగ్గడానికి ఎంతో ఉపయోగపడుతుంది.
మునగాకు, పచ్చిమిర్చి, ఎండు మిర్చి, శెనగపప్పు, మినప్పప్పు, తాలింపు కోసం నువ్వులు, ఉప్పు, నిమ్మరసం.
మునగాకును శుభ్రంగా కడిగి, పచ్చిమిర్చి, ఎండు మిర్చి, శెనగపప్పుతో కలిపి వేయించాలి. మిక్సీలో వేసి ఉప్పు, నిమ్మరసం కలిపి గ్రైండ్ చేయాలి. చివరిగా తిరగమాత వేసుకుంటే చాలు.
ఇడ్లీ, దోశలతో తింటే రుచికరంగా ఉంటుంది.
ఇది మెటబాలిజాన్ని పెంచి ఫాట్ బర్నింగ్‌కి సహాయపడుతుంది.
వారానికి కనీసం 3 సార్లు తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.
పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.